HHVM Box Office: వీరమల్లుకి కలిసిరాని వీకెండ్.. ప్రీమియర్ షోలతో కలుపుకొని మొత్తం ఎన్ని కోట్లు వచ్చాయి?

HHVM Box Office: వీరమల్లుకి కలిసిరాని వీకెండ్.. ప్రీమియర్ షోలతో కలుపుకొని మొత్తం ఎన్ని కోట్లు వచ్చాయి?

భారీ అంచనాల మధ్య రిలీజైన హరి హర వీరమల్లు వసూళ్ళలో పెద్దగా పుంజుకోలేకపోతుంది. వీరమల్లు ప్రీమియర్ షోలతో(జూలై 23) కలుపుకొని..  నాలుగు రోజుల్లోమొత్తం ఇండియాలో రూ.75.65 కోట్ల నెట్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. నిన్న సెలవురోజైన ఆదివారం నాడు సుమారు రూ.11కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది. తెలుగులో 36.14 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది.  

అయితే, మూడో రోజు శనివారం రూ.9.86 కోట్ల నెట్తో పోల్చితే.. కొంచెం ఎక్కువైనప్పటికీ.. అంచనాల తగ్గట్టుగా తక్కువే అని చెప్పుకోవాలి. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమా చూడాలని ఎంతోమంది ఆసక్తిగా వెళతారు. అలాంటిది వీకెండ్లో కూడా రూ.9 కోట్లు, మరో రోజు పదికోట్లు అంటూ లెక్కలు వేసుకుంటూ వెళ్తే.. బాక్సాఫీస్ వద్ద పుంజుకోవడం కష్టమే అని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.

అయితే, వీరమల్లు నాలుగు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందనే పోస్టర్ మాత్రమే మేకర్స్ నుంచి రావట్లేదు. ఈ క్రమంలో సరైన లెక్కలు ఎలా తెలుసుకోవాలి? ఎవర్నీ నమ్మేదంటూ పవన్ ఫ్యాన్స్ వాపోతున్నారు.

ట్రేడ్ సంస్థ సక్నిల్క్ ప్రకారం:

వీరమల్లు భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చినప్పటికీ.. మిక్సెడ్ టాక్ దృష్ట్యా వసూళ్లు సాధించలేకపోతుంది. ఇండియాలో ఫస్ట్ డే గురువారం (జులై24న) రూ.34 కోట్ల నెట్ రాబట్టింది. రెండో రోజు (శుక్రవారం) కేవలం రూ.8 కోట్లతో సరిపెట్టుకుంది. మూడో రోజు శనివారం రూ.9.86 కోట్లు, ఇక నాలుగో రోజు ఆదివారం నాడు రూ.11కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది.

ఓవరాల్గా ఇండియాలో ప్రీమియర్ షోలతో కలుపుకొని మొత్తం రూ.75.65 కోట్ల నెట్, వరల్డ్ వైడ్గా రూ.100 కోట్లకి పైగా గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే, ఎంత జెన్యూన్గా కలెక్షన్లు ప్రకటించినా, అవి ఫేక్ అని కామెంట్లు చేస్తారని వీరమల్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణ‌ తెలిపారు. ప్రస్తుతం కలెక్షన్లు ఎంతో చెప్పే వెబ్ సైట్లు చాలానే అందుబాటులో ఉన్నాయని తనదైన శైలిలో జ్యోతి కృష్ణ‌ చెప్పుకొచ్చారు. ఈ మాటలు చూస్తుంటే.. త్వరలోనే మేకర్స్ నుంచి అనౌన్స్ మెంట్ రావొచ్చని తెలుస్తోంది.