పరీక్ష కోసం : గుర్రంపై వెళ్లిన టెన్త్ క్లాస్ అమ్మాయి

పరీక్ష కోసం : గుర్రంపై వెళ్లిన టెన్త్ క్లాస్ అమ్మాయి

కేరళ: పరీక్ష కోసం ఎవరైనా సైకిల్ పై స్కూలుకు వెళ్తారు. లేకపోతే స్కూలు బస్సులోనో, బస్సులోనే, మరేదైనా వాహనంలో ఎగ్జామ్ సెంటర్ కు వెళ్తారు. కానీ.. కేరళలోని త్రిసూరులో ఓ టెన్త్ క్లాస్ అమ్మాయి గుర్రంపై స్కూలుకు వెళ్లింది. ఆరోజు బంద్ కావడంతో.. గుర్రంపై ఎగ్జామ్ వెళ్లింది ఆ అమ్మాయి. స్కూలు యూనిఫామ్ లో.. బ్యాగ్ వేసుకుని.. బెరుకు లేకుండా గుర్రంపై ఆమె వెళ్తుండగా.. కొందరు వీడియో తీశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుర్రాన్ని నడపడమే చాలా కష్టం.. అలాంటిది ఇంత చిన్న వయసులో… గుర్రపుస్వారీ చేస్తూ వెళ్లడం అనేది చిన్న విషయం కాదు.. అని ఆమెను పొగుడుతున్నారు అందరూ.

గుర్రంపై వెళ్లిన ఆ అమ్మాయి ఎవరంటే..?

వీడియో వైరల్ కావడంతో.. ఈమె సోషల్ మీడియా సెలబ్రిటీ అయిపోయింది. ఈ టెన్త్ క్లాస్ స్టూడెంట్ పేరు సీఏ కృష్ణ. ఉండేది త్రిసూరు దగ్గర్లోని మాలా అనే చిన్న పట్టణంలో. ఆమె తండ్రి అజయ్ కాలింది.. స్థానిక కృష్ణుడి గుడిలో పూజారిగా పనిచేస్తున్నారు. చిన్నప్పుడే కృష్ణ గుర్రపు స్వారీ నేర్చుకుంది. వారికి ఓ పెంపుడు గుర్రం ఉంది. దానికీ ఓ పేరుంది. ఆ గుర్రం పేరు రణక్రిష్. త్రిసూరులోని హోలీ గ్రేస్ స్కూల్ లో కృష్ణ.. టెన్త్ క్లాస్ చదువుతోంది కృష్ణ. ఆమె ఉండే ఏరియాకు.. స్కూల్ కు 3.5 కిలోమీటర్ల దూరం ఉంది. ఎప్పుడైనా స్కూలుకు వెహికిల్ లో వెళ్లడం కుదరనప్పుడు.. బంద్ ఉన్నప్పుడు.. ఇలా గుర్రంపైనే వెళ్తుందట.

సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఈ వీడియోను మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు. ఆమె గురించి వివరాలు తెల్సుకోవాల్సి ఉందని ఆసక్తిగా కోరారు. బాలిక విద్యకు ఈమె బ్రాండ్ అంబాసిడర్ లాంటిదనీ.. ఆమె తన హీరో అయిందని ఆయన వరుస ట్వీట్ లలో చెప్పారు.