
శాయంపేట, వెలుగు: నడుస్తున్న ట్రాక్టర్ పై నుంచి కిందపడి ఓ పదో తరగతి స్టూడెంట్ చనిపోయాడు. ఎస్‌ఐ పరమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్మండలం హౌజ్బుజూర్గు గ్రామానికి చెందిన షేక్ ఫిరోజ్ఆహ్మద్ (16) నేరేడుపల్లిలో గవర్నమెంట్ హైస్కూల్లో టెన్త్ చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం బడి అయిపోగానే ఇంటికెళ్లేందుకు స్కూల్ పిల్లలతో కలిసి బయటికి వచ్చాడు. హౌజుబుజుర్గు గ్రామానికి చెందిన సయ్యద్ఉమర్అనే వ్యక్తి ఆ సమయంలో ట్రాక్టర్ తో స్కూల్ ముందు నుంచి వెళుతున్నాడు.
డ్రైవర్తెలిసిన వ్యక్తి కావడంతో ఇంటికి వెళ్లేందుకు స్టూడెంట్స్ ట్రాక్టర్ ఎక్కారు. ఈ క్రమంలో నేరేడుపల్లి శివారులోని పల్లె ప్రకృతి వనం వద్దకు చేరుకోగానే మూలమలుపు వద్ద డ్రైవర్సయ్యద్ఉమర్సడెన్బ్రేక్వేయడంతో ఫిరోజ్ట్రాక్టర్పై నుంచి కిందపడ్డాడు.
ఫిరోజ్ తల, చాతి, నడుము, భుజానికి బలమైన గాయాలయ్యాయి. ఫిరోజ్‌ను ఆరెపల్లిలోని ఓ ప్రైవేటు హాస్పిట్లకు తరలించగా అప్పటికే అతడుమృతి చెందినట్లు డాక్టర్ చెప్పారు. ఫిరోజ్మృతికి ట్రాక్టర్డ్రైవర్సయ్యద్ ఉమర్కారణమని స్టూడెంట్ తండ్రి షేక్ కమల్బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో శాయంపేట ఎస్ఐ పరమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నట్లు చెప్పారు.