అమెరికాలో ఆయిల్‌‌ బిజినెస్ పేరిట రూ.11 కోట్లు వసూలు

అమెరికాలో ఆయిల్‌‌ బిజినెస్ పేరిట రూ.11 కోట్లు వసూలు
  • అమెరికాలో ఆయిల్‌‌ బిజినెస్ పేరిట రూ.11.60 కోట్లు వసూలు
  • సిటీ సైబర్‌‌‌‌ క్రైమ్ పోలీసులకు బాధితుడు కంప్లయింట్​ 

హైదరాబాద్‌‌, వెలుగు: ఫేస్​బుక్​లో ఫ్రెండ్​రిక్వెస్ట్​గా పరిచయం చేసుకుని ఓ డాక్టర్​వద్ద సైబర్ నేరగాళ్లు రూ.11.60 కోట్లు కొట్లేశారు. మోసపోయిన బాధితుడు గురువారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. అమీర్‌‌‌‌పేటకు చెందిన డాక్టర్​మురళి మోహన్‌‌రావుకు జనవరిలో ఫేస్‌‌ బుక్​లో తన అకౌంట్​కు ఫ్రెండ్‌‌ రిక్వెస్ట్ వచ్చింది. పేరు గీతా నారాయణ్‌‌గా పరిచయం చేసుకుని, అమెరికాలో ఆయిల్‌‌ బిజినెస్‌‌ చేస్తున్నానని చెప్పింది. వ్యాక్సిన్‌‌ తయారు చేసేందుకు ఆగ్రో సీడ్‌‌ ఆయిల్‌‌ సప్లయ్‌‌ చేస్తామని, పర్మిషన్స్‌‌, కస్టమ్స్‌‌ చార్జీల పేరుతో దశల వారీగా రూ.11.60 కోట్లు (డాలర్లలో) వసూలు చేశారు. బాధితుడు మురళీమోహన్‌‌ రావు సిటీ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు ఫైల్​చేశారు.