పటాకుల కేంద్రాల్లో మంటలు,11 మంది మృతి

పటాకుల కేంద్రాల్లో మంటలు,11 మంది మృతి

విరుధ్​నగర్‌: తమిళనాడులోని విరుధ్​నగర్‌ జిల్లాలో దారుణం జరిగింది. రెండు వేర్వేరు పటాకుల కేంద్రాల్లో జరిగిన అగ్నిప్రమాదంలో11 మంది మృతిచెందగా, ఇద్దరు గాయాలపాలయ్యారు. జిల్లాలోని రంగపాళ్యంలోని ఓ ఫైర్​వర్క్స్​ యూనిట్​లో జరిగిన ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. గాయాలతో బయటకు తీసిన మరో ముగ్గురు కూడా మృతి చెందారు.

ఇదే జిల్లాలో కిచ్చనాయకన్‌పట్టి గ్రామంలోని పటాకుల యూనిట్​లో జరిగిన బ్లాస్టింగ్​లో వెంబు(35) అనే వ్యక్తి చనిపోయాడు. సమాచారం అందుకున్న ఫైర్, రెస్క్యూ టీమ్​ ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. స్వాధీనం చేసుకున్న 7 మృతదేహాలను ఇంకా గుర్తించలేదని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.