నా కోసం 111 జీవోను ఎత్తేయలేదు : కేటీఆర్

నా కోసం 111 జీవోను ఎత్తేయలేదు : కేటీఆర్

తెలంగాణలో పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతున్నదని కేటీఆర్​ చెప్పారు. తెలంగాణ రాకముందు కరెంటు కోతలు ఉండేవని, రాష్ట్రం వచ్చిన తర్వాత ఆరు నెలల్లోనే ఆ సమస్య లేకుండా చేశామని చెప్పారు. ఇండస్ట్రీలకు, వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అన్నారు. ‘‘2022 నాటికి అందరికీ ఇండ్లు కట్టిస్తామని ఒక పెద్దాయన (ప్రధానిని ఉద్దేశించి) చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని కోతలు కోశారు. ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తే పనులు కావు. వనరులను సమర్థంగా ఉపయోగించుకోవాలి’’ అని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఎంతో ముందుకు వెళ్తున్నదని, ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి మెట్రోల కంటే హైదరాబాద్​లో బిజినెస్​ చేయడం సులభమని చెప్పారు. 111 జీవోను తన కోసమే ఎత్తివేశారని ఒక పిచ్చోడు మాట్లాడాడని, ఈ జీవో పరిధిలో 1.30 లక్షలు ఎకరాలు ఉన్నాయని, అవన్నీ తనవేనా అని ప్రశ్నించారు.  111 జీవోను రద్దు చేయడం వల్ల 84 ఊర్లకు మేలు జరుగుతుందన్నారు.