Spain History Repeats: ఫుట్‌బాల్ ప్రపంచంలో కొన్ని రికార్డులు చూస్తే ఇది నిజంగానే జరిగిందా.. లేక దైవ సంకల్పమా? అనే డౌట్ ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది. ఇప్పుడు స్పెయిన్ (La Roja) టీమ్ క్రియేట్ చేసిన ఒక అరుదైన విషయం (Coincidence) సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. స్పెయిన్ తన హిస్టరీలో రెండు సార్లు ఫిఫా వరల్డ్ కప్ గెలిచింది. కానీ ఇక్కడ కిరాక్ మ్యాటర్ ఏంటంటే.. ఆ రెండు సార్లూ నిర్ణీత 90 నిమిషాల టైమ్‌లో మ్యాచ్ గెలవలేదు.. అదనపు సమయం (Extra Time) లోనే గోల్స్ కొట్టి మరి కప్ కొట్టింది. కాలం మారినా, ఆటగాళ్లు మారినా.. లాస్ట్ మినిట్ ప్రెజర్‌ను హ్యాండిల్ చేయడంలో తామెప్పుడూ కింగ్స్ అని స్పానిష్ ఆర్మీ మరోసారి ప్రూవ్ చేసింది. అసలు ఈ రెండు విజయాల వెనుక ఉన్న ఆ ట్రెండింగ్ హిస్టరీ ఏంటో ఒక్కసారి చూసేద్దాం..
116వ నిమిషంలో ఇనియెస్టా క్లాస్ మాస్ రాంపేజ్:
2010 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ గుర్తుందా? నెదర్లాండ్స్ వర్సెస్ స్పెయిన్ మధ్య మ్యాచ్ ఈ ఫైట్ జరిగింది. ఇరు జట్ల డిఫెన్స్ పుణ్యమా అని 90 నిమిషాల వరకు ఒక్క గోల్ (0–0) పడలేదు. మ్యాచ్ కాస్తా పెనాల్టీ షూటౌట్ వైపు వెళ్తుందనుకుని ఫ్యాన్స్ అందరూ టెన్షన్‌తో గోళ్లు కొరుక్కుంటున్న సమయంలోనే.. ఎక్స్‌ట్రా టైమ్ 116వ నిమిషంలో స్పానిష్ లెజెండ్ ఆండ్రెస్ ఇనియెస్టా (Andres Iniesta) ఒక అద్భుతమైన వండర్ గోల్ కొట్టాడు. అంతే, డచ్ టీమ్ గుండెలు పగిలాయి.. స్పెయిన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ వరల్డ్ కప్ అందుకుంది.
106వ నిమిషంలో ఫెర్రాన్ టోర్రెస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ:
సరిగ్గా 16 ఏళ్ల తర్వాత నిన్న (ఆదివారం, జూలై 19, 2026) జరిగిన మెగా ఫైనల్లోనూ అదే సీన్, అదే ఎమోషన్ రీ-టెలికాస్ట్ అయింది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లోనూ 90 నిమిషాల వరకు ఎలాంటి గోల్స్ కొట్టలేదు ఇరు జట్లు. కానీ ఈసారి ఎక్స్‌ట్రా టైమ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన మొదటి నిమిషంలోనే.. అంటే సరిగ్గా 106వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ స్ట్రైకర్ ఫెర్రాన్ టోర్రెస్ (Ferran Torres) మెరుపు వేగంతో గోల్ కొట్టి అర్జెంటీనాకి షాక్ ఇచ్చాడు. 10 మందితో ఆడుతున్న అర్జెంటీనా ఆ దెబ్బకు కోలుకోలేకపోయింది. దీంతో స్పెయిన్ 1–0 తేడాతో రెండోసారి వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించింది.
గూస్‌బంప్స్ తెప్పించే 3 క్రేజీ పోలికలు:
స్పెయిన్ సాధించిన ఈ రెండు విజయాల మధ్య ఉన్న సిమిలారిటీస్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే:
* రెండు సార్లూ అదే 1–0 మ్యాజిక్: 2010లో నెదర్లాండ్స్‌పై అయినా, ఇప్పుడు 2026లో మెస్సీ సేనపై అయినా.. స్పెయిన్ ఫైనల్స్ గెలిచింది. కేవలం 1–0 తేడాతోనే.
* సరిగ్గా 10 నిమిషాల తేడా: టైమింగ్స్ కూడా ఎంత పక్కాగా సెట్ అయ్యాయో ఒక్కసారి చూడండి. 2010లో 116వ నిమిషంలో గోల్ చేస్తే.. 2026లో సరిగ్గా 10 నిమిషాల ముందే, అంటే 106వ నిమిషంలోనే స్పెయిన్ గోల్ కొట్టింది.
ALSO READ : మెస్సీకి బిగ్ షాక్.. గోల్డెన్ బాల్, గోల్డెన్ షూ రెండూ మిస్..
* ఐరన్ వాల్ డిఫెన్స్ రికార్డు: రెండు వరల్డ్ కప్‌లలోనూ స్పెయిన్ డిఫెన్స్ శ్రేణి ఒక అడ్డు గోడలా నిలిచింది. ముఖ్యంగా ఈ 2026 వరల్డ్ కప్ టోర్నమెంట్ మొత్తంలో ప్రత్యర్థులకు కేవలం ఒక్కటంటే ఒక్క గోల్ మాత్రమే సమర్పించుకుని వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. కాగా ఫుట్‌బాల్ హిస్టరీలోనే అత్యంత అరుదైన ఈ ఎక్స్‌ట్రా టైమ్ కోఇన్సిడెన్స్ చూస్తుంటే ఒకటి మాత్రం క్లియర్ కట్ గా అధిపత్యం చెలయిస్తుంది.
Andrés Iniesta in 2010. Ferran Torres in 2026.
— FIFA World Cup (@FIFAWorldCup) July 19, 2026
Two golden Spain moments in the #FIFAWorldCup Final ⌚️ pic.twitter.com/mMsVI0Y6EI
