రాష్ట్రంలో రోడ్డెక్కిన మరో 118 జేబీఎం బస్సులు..ఇప్పటికే 150 బస్సులు అందుబాటులోకి

రాష్ట్రంలో రోడ్డెక్కిన మరో  118 జేబీఎం బస్సులు..ఇప్పటికే 150 బస్సులు అందుబాటులోకి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రయాణికుల సౌకర్యార్థం మరో 118 జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కాయి. ఇప్పటికే 150 బస్సులు సేవలు అందిస్తుండగా.. ఆర్టీసీ అధికారులు ప్రకటించిన మొత్తం 500 బస్సుల్లో మిగిలినవి కూడా మరో రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. గత వారం ఎలక్ట్రిక్ బస్సుల బ్యాటరీలు పేలి మంటలు చెలరేగిన వరుస ఘటనల నేపథ్యంలో అధికారులు ఈ బస్సుల సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు చైనా నుంచి టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగింది. 

బ్యాటరీల పనితీరును క్షుణ్నంగా పగారిశీలించి, సదరు టీం ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాతనే ప్రస్తుతం బస్సులను రోడ్డుపైకి అనుమతిస్తున్నారు. మిగిలిన 232 బస్సుల ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌పై టెక్నికల్ టీమ్ మరో రెండు, మూడు రోజుల్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని అధికారులు తెలిపారు. దీంతో త్వరలోనే అన్ని ఎలక్ట్రిక్ బస్సులు పూర్తి స్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ లోపు ప్రయాణికులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ అధికారులు ముందస్తు జాగ్రత్తగా తగినన్ని డీజిల్ బస్సులను అందుబాటులో ఉంచారు.