
- వెలుగు కథనానికి స్పందన
- 12 ఎకరాల భూమి ధరణిలో మార్చాం–మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ కుమార్
- కొర్రెముల మండలం వెంకటాపూర్ ఆర్ ఎస్ నెం: 174
- ప్రభుత్వ భూమిని .. ప్రైవేట్వ్యక్తుల పేరుతో ధరణి పోర్టల్
ఘట్కేసర్, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలంలోని కొర్రేముల రెవెన్యూ గ్రామం వెంకటాపూర్‌లో ఉన్న సర్వే నంబర్ 174లోని18.12 ఎకరాల భూమి పూర్తిగా ప్రభుత్వానికి చెందినదని కలెక్టర్ గౌతమ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం వెలుగులో ‘ఆమోయ్ కుమార్ మరో మాయ’ హెడ్డింగ్‌తో భూబదలాయింపుపై కథనం పబ్లిష్ కాగా.. కలెక్టర్, అడిషనల్కలెక్టర్ స్పందించారు.
సర్వే నంబర్ 174 లోని దాదాపు 12 ఎకరాల భూ వివాదంపై అధికారులు విచారణ జరిపారని, అది ప్రభుత్వ భూమి అని తేలడంతో ధరణి పోర్టల్‌లో ప్రైవేట్ వ్యక్తుల పేర్లను తొలగించి ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చామన్నారు. అయితే, ఆ 12 ఎకరాల ప్రభుత్వ భూమి తమదేనంటూ తప్పుడు పేపర్లు, దొంగ పాస్‌బుక్స్‌తో రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించుకున్న వారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.