15 రోజులే గడువు.. లేకపోతే ప్రగతి భవన్ ముట్టడి

15 రోజులే గడువు.. లేకపోతే ప్రగతి భవన్ ముట్టడి
  • మా ఇళ్లు మాకిప్పించమంటూ మీర్ పేట్ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన
  • అధికార పార్టీ నేతలు తమ ఇళ్లను కబ్జా చేశారని బాధితుల ఆరోపణ
  • మీర్ పేట్ నందనవనం JNNURM బాధితులు

హైదరాబాద్: మీర్ పేట్ పోలీసు స్టేషన్ ఎదుట JNNURM ఇళ్ల లబ్దిదారులు, బాధితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమకు కేటాయించిన ఇళ్లను తమకు ఇప్పించేలా చొరవ తీసుకోవాలని బాధితులు కోరారు. ఎల్బీనగర్ నియోజవర్గం పరిధిలోని మీర్ పేట్ నందనవనంలో జె.ఎన్.ఎన్.యూ.ఆర్.ఎమ్ స్కీమ్ కింద ప్రభుత్వం 512 నివాస గ్రుహాలను నిర్మించిందని, వాటి తాళాలను కూడా తమకు అప్పగించాక. అధికారపార్టీకి చెందిన కొందరు తమ ఇళ్లను కబ్జాచేశారని ఆరోపించారు.
తమకు కేటాయించిన ఇళ్ల దగ్గరకు వెళ్తే కబ్జాదారులు తమపై దాడులు చేస్తున్నారని వారు వాపోయారు. 2016లోనే ఈ ఇళ్ల కోసం ఒక్కో లబ్ధిదారుడు రూ.80,250 చెల్లించామని చెప్పారు. నాయకులు,అధికారుల నిర్లక్ష్యం  వల్ల 512 కుటుంబాలు రోడ్డుపాలు అయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన పేద కుటుంబాలను ఇప్పటికైనా గుర్తించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కి బాధితులు విన్నవించారు. 15 రోజుల్లో లో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల లు కేటాయించకపోతే ప్రగతి భవన్ ముట్టడి కూడా వెనుకాడబోమని బాధితులు హెచ్చరించారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని కలెక్టర్ ఆదేశాలతో విచారణ నిర్వహించిన మీర్ పేట్ సిఐ నివేదికను సీపీకి అందజేయనున్నట్టు తెలిపారు.