జ‌య‌శంక‌ర్ జిల్లాలోని చ‌లివాగులో చిక్కుకున్న 12 మంది రైతులు

జ‌య‌శంక‌ర్ జిల్లాలోని చ‌లివాగులో చిక్కుకున్న 12 మంది రైతులు

జయశంకర్ జిల్లా: రాష్ట్ర‌వ్యాప్తంగా 3 రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్న విష‌యం తెలిసిందే. శ‌నివారం టేకుమట్ల మండలం కుందనపల్లి వద్ద చ‌లివాగు వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటే ప్రయత్నంలో 12 మంది రైతులు నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. కుందన పల్లి గ్రామానికి చెందిన 12 మంది రైతులు వాగు ఒడ్డున ఉన్న మోటర్లు మునుగు తున్నాయని ట్రాక్టర్ ద్వారా మోటార్లు తీసుకొద్దామని వెళ్లగా.. ఒకేసారి వాగు ఉప్పొంగి రావడంతో మధ్యలో ఉన్న మర్రి చెట్టు గడ్డపైన 12 మంది రైతులు ఇరుక్కుపోయారు.

వర్షం పడుతున్న కొద్దీ తాకిడి ఎక్కువ కావడంతో గడ్డపైకి నీరు వచ్చే ప్రమాదం పొంచి ఉంది.  పోలీసులు, రెస్క్యూ టీం వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అవి సఫలం కావడంలేదు. వాగులో చిక్కుకున్న రైతుల పరిస్థితిపై స్థానికులు.. కలెక్టర్ కు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డికి సమాచారం అందించగా.. హెలికాప్టర్ ను రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఆర్మీ హెలికాప్టర్ రానున్నట్టు సమాచారం.