హైదరాబాద్ లో పెరిగిన కరోనా కేసులు

హైదరాబాద్ లో పెరిగిన కరోనా కేసులు

హైదరాబాద్ :  రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత మూడు రోజుల్లో వందకి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా  గడిచిన 24 గంటల్లో కొత్తగా 122 కేసులు వెలుగు చూశాయి. మరణాలేమీ నమోదు కాలేదు. కరోనా నుంచి 42 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 811 యాక్టివ్ కేసులున్నాయి.  హైదరాబాద్‌లో 94, మేడ్చల్‌, మల్కాజ్‌గిరిలో 9, రంగారెడ్డి జిల్లాలో 12, సంగారెడ్డిలో 3 కొత్తగా కేసులు నమోదైయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.