
ఫుల్లు వర్షం. దానికి తోడు వరదలు. మూడు గంటల పాటు ఒక్కటే శబ్దం, దానితోపాటు పిడుగులు ఇదీ వాషింగ్టన్‌లో శనివారం రాత్రి పరిస్థితి. దాదాపు మూడు గంటలపాటు 1,250 పిడుగులు పడినట్లు సియాటిల్ వాతావరణ శాఖ తెలిపింది. ఒక సియాటిల్ ప్రాంతంలోనే 200 పడ్డాయని, విద్యుత్‌కు తీవ్ర అంతరాయం కలిగిందని తెలిపింది. మేఘాలు ఒకాదానికొకటి ఢీకొట్టినప్పుడు ఉరుములు, మెరుపులు వస్తాయి. మెరుపుల తీవ్రత ఎక్కువున్నప్పుడు అవి భూమి వరకు వ్యాపిస్తాయి. వాటినే మనం పిడుగులు అంటాం.