గాజాలో ఆగని దాడులు.. ఇప్పటికి 126 మంది మృతి

గాజాలో ఆగని దాడులు.. ఇప్పటికి 126 మంది మృతి

గాజా: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న హింసలో చాలా మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఘర్షణలు మొదలై ఐదు రోజులవలవుతున్నా ఇరు వర్గాలు పట్టు విడవకపోవడంతో గాజా నెత్తురోడుతోంది. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి గాజాలో 133 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇజ్రాయెల్‌లో 8 మంది చనిపోయారు.

ఈ ఘర్షణల్లో గాజాలో 31 మంది పిల్లలు కూడా మృతి చెందారని, 950 మంది వరకు గాయపడ్డారని తెలుస్తోంది. శుక్రవారం ఘర్షణలు గాజాలోని వెస్ట్‌బ్యాంక్‌కి పాకాయి. అక్కడ 10 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా.. వందల మంది గాయపడ్డారని సమాచారం. ఈ ఘర్షణలను చల్లార్చేందుకు గానూ ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య చర్చలు నిర్వహణకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమైంది. ఇందులో భాగంగా చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు యూఎస్ రాయబారి హ్యాడీ టెల్ అవీవ్ పట్టణానికి చేరుకున్నారు.