ఒక్క రోజులోనే వెంటిలేటర్‌‌పైకి 127 మంది

ఒక్క రోజులోనే వెంటిలేటర్‌‌పైకి 127 మంది
  • మొత్తం 1,573 మంది కరోనా పేషెంట్ల పరిస్థితి సీరియస్‌
  • ఆక్సిజన్‌ సపోర్ట్‌ పై మరో 3,366 మంది
  •  రోజురోజుకూ పెరుగుతున్న సివియర్ కేసులు

హైదరాబాద్, వెలుగు: కరోనా వల్ల లంగ్స్‌‌పాడై పోయి సీరియస్ అవుతున్న పేషెంట్లసంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పరిస్థితి విషమించడంతో శనివారం ఒక్కరోజే 127 మందిని వెంటిలేటర్‌‌ ‌‌పైకి షిఫ్ట్‌ చేసి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. రోజూ దాదాపు ఇదే పరిస్థితి ఉంటోందని డాక్టర్లుచెబుతున్నారు. సర్కార్ లెక్కల ప్రకారం ప్రస్తుం రాష్ర్టంలో 31,284 మంది యాక్టివ్  పేషెంట్లు ఉంటే, ఇందులో 7,108 (22.72 శాతం) మందికి వైరస్ లక్షణాలు తీవ్రంగా ఉండటంతో దవాఖాన్లలో అడ్మిట్ అయ్యారు. వీరిలో 1,573 మంది పరిస్థితి విషమించి మృత్యువుతో పోరాడుతున్నారు. వైరస్ ఎఫెక్ట్‌‌ తో లంగ్స్ పాడైపోయి సొంతగా ఊపిరి తీసుకోలేక, వెంటిలేటర్‌‌‌‌పై కృత్రిమ శ్వాసతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆక్సిజన్‌‌ సపోర్ట్‌‌ పై మరో 3,366 మంది చికిత్స పొందుతున్నారు. శుక్రవారం దాకా వెంటిలేటర్‌‌‌‌పై ఉన్న వారి సంఖ్య 1,446 కాగా, శనివారానికి 1,573కు పెరిగినట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అంటే ఒక్క రోజులోనే 127 మందిని వెంటిలేటర్‌‌‌‌పైకి షిఫ్ట్‌ ‌చేసినట్టు స్పష్ట మవుతోంది. ఆక్సిజన్‌‌ సపోర్పై ట్‌‌ ఉన్నవాళ్లలో రోజూ వంద నుంచి నూట యాభై మంది పరిస్థితి విషమించి వెంటిలేటర్‌‌‌‌వరకూ వెళ్తున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. వెంటిలేటర్‌‌‌‌దాకా వెళ్ళిన  వాళ్లలో ఇదివరకు 10 శాతం మందే కోలుకునేవారు. ప్రస్తుం 50 శాతం మంది కోలుకుంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు.

మరో 2,924 మందికి కరోనా

ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్షా 23 వేలు దాటింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి, శనివారం రాత్రి 8 గంటల దాకా 2,924 మందికి పాజిటివ్ వచ్చిందని హెల్త్ డిపార్ట్‌మెంట్‌ ప్రకటించింది. గ్రేటర్‌ ‌‌‌హైదరాబాద్‌ పరిధిలో 461, జిల్లాల్ లో2,463 కేసులు నమోదైనట్టు పేర్కొంది. జిల్లాల్లోఅత్యధికంగా రంగారెడ్డి (నాన్‌‌జీ హెచ్‌ఎంసీ)లో 213, మేడ్చల్‌‌(నాన్‌‌జీహెచ్‌ఎంసీ) లో 153 కేసులు రాగా, కరీంనగర్‌‌లో 172, నల్గొండలో 171, ఖమ్మంలో 181, నిజామాబాద్‌లో 140, సూర్యాపేటలో 118, వరంగల్ అర్బన్‌‌లో 102 కేసులు నమోదయ్యాయి. కొత్తగూడెం, జగిత్యాల, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌‌‌‌, మంచిర్యాల, నాగ ర్‌‌‌‌కర్నూల్‌‌ , పెద్ద పల్లి, రాజన్న సిరిసిల్ల, భువనగిరి జిల్లాల్ లో50కి పైగా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,23,090కు పెరిగింది. ఇందులో 90,988 మంది కోలుకున్నారు. యాక్టివ్ యాక్టి పేషెంట్లలో 24,176 మంది హోమ్‌‌, ఇన్ స్టిట్యూషనల్ ఐసోలేషన్‌‌లో ఉండగా, 7,108 మంది పేషెంట్లుప్రభుత్వ, ప్రైవేట్‌‌ దవాఖాన్లలో చికిత్స పొం దుతున్నారు

50 రోజులుగా ఒకే లెక్క

కరోనాతో శనివారం 10 మంది చనిపో యారని, మొత్తం మరణాల సంఖ్య 818కి పెరిగిందని ఆరోగ్యశాఖ బులిటెన్‌‌లో పేర్కొ న్నారు. చనిపోయిన వారిలో 53.87 శాతం మంది ఇతర రోగాలతో బాధపడుతున్నవాళ్లు ఉండగా, 46.13 శాతం మందిలో ఏ రోగాలు లేవని, కేవలం కరోనా కారణంగానే చనిపో యినట్టు బులిటెన్‌‌లో చూపించారు. సుమారు 50 రోజులుగా పర్సంటేజీ లెక్క ఇలాగే చూపిస్తున్నారు. మరోవైపు శనివారం చేసిన 61,148 టెస్టులతో కలిపి, రాష్ర్టం లో మొత్తం 13,27,791 మందికి కరోనా టెస్టులు చేయిం చినట్టు వెల్లడిం చారు. అయితే ఇందులో ఎం తమందికి యాంటిజెన్ టెస్ట్‌‌, ఎంత మందికి ఆర్టీపీసీర్టీ  టెస్ట్ చేశారనే విషయాన్ని సర్కార్ సీక్రెట్‌‌గా ఉంచుతోంది. ఏయే టెస్టులు ఎన్ని చేశారో ఇతర రాష్ట్రాల్లో వెల్ల డిస్తున్నా.. మన సర్కార్ మాత్రం బయటికి చెప్పడం లేదు. అలాగే ఏయే జిల్లాల్ లో ఎన్ని టెస్టులు చేశారన్న అంశాన్నికూడా బయటపెట్టడం లేదు. దీంతో టెస్టులు చేస్తున్నారా లేదా చేయకుండానే చేసినట్టు ప్రకటిస్తున్నారా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.