తెలంగాణలో కొత్తగా 130 దేవాలయాల నిర్మాణం

తెలంగాణలో కొత్తగా 130 దేవాలయాల నిర్మాణం

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో 2,378 దేవా ల‌‌యాల నిర్మాణానికి సుమారు రూ.598 కోట్లు మంజూరు చేశామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వ‌‌ర‌‌కు రూ.225 కోట్ల విలువైన ప‌‌నులు పూర్తి చేశామ‌‌ని చెప్పారు. వీటికి అద‌‌నంగా రూ.37.34 కోట్ల వ్యయంతో మరో 130  ఆల యాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

శనివారం సెక్రటేరియెట్ లో సీజీఎఫ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కామ‌‌న్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధుల‌‌తో చేప‌‌ట్టిన ఆల‌‌యాల పున‌‌ర్నిర్మాణ‌‌, అభివృద్ధి ప‌‌నులను త్వరిత‌‌గ‌‌తిన పూర్తి చేయాల‌‌ని అధికా రులను మంత్రి ఆదేశించారు.