చెన్నైలో రేసింగ్ ప్రమాదం..13 ఏళ్లకే బైక్ రేసర్

చెన్నైలో రేసింగ్ ప్రమాదం..13 ఏళ్లకే బైక్ రేసర్

చెన్నైలో జరుగుతున్న జాతీయ మోటార్‌సైకిల్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ లో జరిగిన బైక్ క్రాష్ లో ప్రముఖ భారతీయ రేసర్ శ్రేయాస్ హరీష్ మృతిచెందాడు. శనివారం ఇరుంగట్టుకోట్టైలో జరిగిన బైక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ లో 200సీసీ బైక్‌ను నడుపుతుండగా మూడో రౌండ్ రేసులో స్కిడ్ అయి కింద పడిపోయాడు. హెల్మెట్ తలనుంచి వేరుకావడంతో తలకు తీవ్రగాయమైంది. వెంటనే శ్రేయాస్‌ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. శ్రేయాస్ మరణంతో మిగిలిన రేసులను మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ రద్దు చేసింది. 

'ది బెంగళూరు కిడ్'గా ప్రసిద్ధి చెందిన శ్రేయాస్ బైక్ రేసింగ్లో  ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరిన తొలి భారతీయుడు.13 ఏళ్ల  వయసులో ఇటీవల స్పెయిన్లో జరిగిన బైక్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్కు చేరాడు. జూలై 26న తన 13వ పుట్టినరోజును జరుపుకున్న శ్రేయాస్ మంచి యువ మోటర్‌బైక్ రేసర్‌గా గుర్తింపు పొందాడు. బైక్ రేసింగ్ అతని ప్రతిభ అసాధారణం. ఈ ఏడాది స్పెయిన్‌లో జరిగిన FIM మినీ- GP ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. మొదటి, రెండవ రేసుల్లో వరుసగా 5వ , 4వ స్థానాల్లో నిలిచి తన ప్రతిభ,సామర్థ్యాన్ని చాటుకున్నాడు. 

ఈ ఏడాది మేలో స్పెయిన్‌లో ద్విచక్ర వాహన రేసింగ్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకున్న తొలి భారతీయుడిగా రేసింగ్ ప్రాడిజీ చరిత్ర సృష్టించాడు. అతను స్పెయిన్‌లో జరిగిన FIM మినీ-GP ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు మరియు మొదటి మరియు తదుపరి రెండవ రేసుల్లో వరుసగా 5వ మరియు 4వ స్థానాల్లో నిలిచాడు, తన ప్రతిభను మరియు సామర్థ్యాన్ని ప్రదర్శించాడు.