
కీసర, వెలుగు: నాగారం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. 14 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టాలని మేడ్చల్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. గురువారం కీసర ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి నాగారం మున్సిపల్ ఆఫీసులో తీర్మానంపై ఓటింగ్ నిర్వహించగా సభ్యులు ఎవరూ హాజరు కాలేదు. మధ్యాహ్నం సమావేశం ఏర్పాటు చేసినా వాయిదా పడింది.
దీంతో చైర్మన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం వీగిపోయిందని ఆర్డీవో ప్రకటించారు. దీనిపై కలెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి. రాజేందర్ కుమార్, కీసర సీఐ వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహశీల్దార్ భాస్కర్ రెడ్డి, మున్సిపల్ మేనేజర్ కె. చంద్రశేఖర్, ఎస్ఐ నాగరాజు, పోలీసు సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.