శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో.. రూ.14 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో.. రూ.14 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత

 హైదరాబాద్  శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. జనవరి 9న ఉదయం   దుబాయ్ నుంచి హైదరాబాద్ కు  వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా..  14 కిలోల హైడ్రోఫోనిక్  గంజాయిని దొరికింది. దీని విలువ రూ.14 కోట్లు ఉంటుందని అంచనా వేశారు అధికారులు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసుల.. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల  హైడ్రో ఫోనిక్( మట్టి లేకుండా సాగు చేసే)ను విదేశాలల నుంచి భారత్ కు భారీగా తరలిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ లో దాదాపు కిలో హైడ్రో ఫోనిక్ గంజాయి పట్టుబడింది. నిందితులు గంజాయిని అక్కడే వదిలి పారిపోయారు.

2025 అక్టోబర్ 26

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్టోబర్ 26న  బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ భారత  ప్రయాణికుడిని  తనిఖీ చేయగా  హైడ్రోపోనిక్  గంజాయి తరలిస్తున్నట్లు డిఆర్ఐ అధికారులు స్కానింగ్ లో కనుగొన్నారు. వెంటనే అప్రమత్తమైన డీఆర్ఐ  అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు.  లగేజ్ ని తనిఖీ చేయగా సపరేట్ గా తయారు చేసిన  సూట్ కేసులో  4.5 కేజీల హైడ్రోపోనిక్  గంజాయి దొరికింది.  పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 4.5 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

 2025సెప్టెంబర్ 20

శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో 12 కోట్ల రూపాయలు విలువ చేసే హైడ్రోపోనిక్ గంజాయిని అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు వచ్చిన ప్రయాణిరాలి లగేజీ బ్యాగేజ్లో ఈ గంజాయిని అధికారులు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకున్న డిఆర్ఐ అధికారులు 12 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిపై డిఆర్ఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.