వనమా రాఘవకు 14 రోజుల కస్టడీ

వనమా రాఘవకు 14 రోజుల కస్టడీ

పాల్వంచ రామకృష్ణ కుటుంబం బలైన కేసులో ఏ2గా ఉన్న వనమా రాఘవకు కోర్టు 14 రోజుల కస్టడీ విధించింది. శుక్రవారం రాత్రి పోలీసులు రాఘవను అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఉదయం వైద్యపరీక్షల అనంతరం పాల్వంచ పోలీసులు.. రాఘవను కొత్తగూడెం జిల్లా జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారించిన మెజిస్ట్రేట్.. రాఘవకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. దాంతో రాఘవను పోలీసులు భద్రాచలం సబ్ జైలుకు తరలించారు. 

కాగా.. వనమా రాఘవను కోర్టులో ప్రవేశపెట్టడానికి పాల్వంచ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్తుండగా బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. రాఘవ కేసును సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.