విషాదం: టెంపో-లారీ ఢీ.. 14 మంది మృతి

V6 Velugu Posted on Feb 14, 2021

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద తెల్లవారు జామున టెంపో వాహనం లారీని ఢీ కొట్టింది . ఈ ఘటనలో 14 మంది అక్కడిక్కడే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.  టెంపో వాహనం చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి అజ్మీర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 8 మంది మహిళలు, ఐదుగురు పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు . ప్రమాద సమయంలో టెంపోలో 18 మంది ఉన్నారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయాలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా మదనపల్లి అంబచెరువు మిట్టా ఎన్టీఆర్ కాలనీ వాసులుగా గుర్తించారు పోలీసులు. టెంపో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.

Tagged road accident, Kurnool, 14dead, tempo

Latest Videos

Subscribe Now

More News