
- నిమజ్జన విధుల్లో14,486 కార్మికులు
- నిరంతరాయంగా వేల టన్నుల చెత్త ఎత్తిన శానిటేషన్ కార్మికులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: నిమజ్జనం తర్వాత సిటీ రోడ్లు చెత్తతో పేరుకుపోయాయి. ఎక్కడ చూసినా పేపర్ షాట్స్, పటాకుల అవశేషాలు, కలర్లకి సంబంధించి షాట్స్, ఫుడ్ప్యాకెట్స్, ప్లాస్టిక్బాటిల్స్, డబ్బాలు ఇతర వ్యర్థాలు పేరుకుపోయాయి. వీటిని తొలగించడానికి వేల మంది శానిటేషన్కార్మికులు రాత్రనక, పగలనక కష్టపడ్డారు. ఎంత ఊడ్చినా గాల్లోకి లేవడంతో కొన్ని చోట్ల నీళ్లతో క్లీన్ చేశారు.హుస్సేన్సాగర్తీర ప్రాంతంలో అయితే, టన్నుల కొద్దీ చెత్తను భక్తులు పడేశారు.
నిమజ్జనం మూడో రోజు నుంచే చెత్త ఎత్తే కార్యక్రమాన్ని మొదలుపెట్టగా అది ఆదివారం వరకు నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. మొత్తంగా నిమజ్జనం శోభాయత్ర జరిగిన 303 కిలోమీటర్ల మేర రోడ్లను క్లీన్ చేసేందుకు బల్దియా14,486 కార్మికుల సేవలను వినియోగించుకుంది. వీరంతా షిఫ్టుల వారీగా పని చేశారు. నిమజ్జనం తర్వాత అందరూ ఇండ్లకు పరిమితమైనా శానిటేషన్ వర్కర్లు రోడ్లను క్లీన్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఉత్సవాలు జరిగిన రోజుల్లో వీరంతా కలిసి 20 వేల టన్నులకు పైగా చెత్తను తొలగించారు. ఈ క్రమంలో బషీర్బాగ్వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కార్మికురాలు ప్రాణాలు కోల్పోయింది.
హుస్సేన్ సాగర్ లో విగ్రహ వ్యర్థాలు
రోడ్లపై చెత్తతో పాటు సాగర్లో విగ్రహాలకి సంబంధించి వ్యర్థాలను హెచ్ఎండీఏ అధికారులు తొలగిస్తున్నారు. నవరాత్రుల్లో మూడో రోజు నుంచి శనివారం ఉదయం వరకే 4,350 వేల టన్నుల వ్యర్థాలు తీశారు. శనివారం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు పోగైన వ్యర్థాలను తొలగిస్తున్నారు. ఈ ప్రక్రియ మరో రెండు రోజుల పాటు కొనసాగనున్నది. తీయబోయే వ్యర్థాలు 8 టన్నుల వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ డెబ్రీస్ను లోయర్ ట్యాంక్ బండ్ లోని జీహెచ్ఎంసీ ట్రాన్స్ ఫర్ స్టేషన్ కి పంపుతున్నారు.