వెంటిలేటర్లపై 1,479 ప్రాణాలు..ఆక్సిజన్ పై 3,172 మంది కరోనా పేషెంట్లు

V6 Velugu Posted on Aug 29, 2020

  • దవాఖాన్ల పాలవుతున్న కరోనా బాధితులు
  • కొత్తగా2,932మందికి వైరస్ 
  • 1,17,415కుపెరిగిన కేసులు
  • కరోనాతో మరో 11 మంది మృతి

హైదరాబాద్, వెలుగు: ఆక్సిజన్ లెవల్స్‌ పడిపోయి దవాఖాన్ల పాలవుతున్న కరోనా పేషెంట్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ హా స్పిటళ్లలో కలిపి బుధవారం వరకూ 1,388 మంది పేషెంట్లు వెంటిలేటర్‌‌పై ఉండగా, గురువారం ఈ సంఖ్య 1,479కి పెరిగినట్టు శుక్రవారం నాటి బులెటిన్‌లో ఆరోగ్యశాఖ వెల్లడించింది. బుధవారం వరకూ 3,020 మంది ఆక్సిజన్‌పై ఉండగా, గురువారం ఈ సంఖ్య 3,172కు పెరిగింది. ఒక్క రోజులోనే వెంటిలేటర్ అవసరం ఉన్నోళ్లు 91 మంది, ఆక్సిజన్ కావాల్సి నోళ్లు152 మంది పెరిగారు. అయితే కొన్ని ప్రైవేట్ టీచింగ్ హాస్పిటళ్లలో చికిత్స  పొందుతున్న పేషెంట్ల లెక్కలను బులెటిన్‌లో చూపించలేదు. ఆ లెక్కలను కూడా కలిపితే, హాస్పిటళ్లలో ఉన్నవారి సంఖ్య మరో 500 పెరిగే అవకాశం ఉంది.

మరో 2,932మందికి కరోనా

ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్షా 17 వేలు దాటింది. బుధవారం రాత్రి 8 నుంచి, శుక్రవారం రాత్రి 8 వరకూ 61,863 మందికి టెస్టులు చేయగా, 2,932 మందికి వైరస్ ఉన్నట్టు కన్ఫామ్ అయిందని హెల్త్ డిపార్ట్మ ర్టెంట్ ప్రకటించింది. గ్రేటర్‌‌ హైదరాబాద్‌ పరిధిలో 520, జిల్లాల్లో 2,412 కేసులు నమోదైనట్టు శుక్రవారం ఉదయం బులెటిన్‌లో పేర్కొన్నారు. జిల్లాల్లో అత్యధికంగా రంగారెడ్డి(నాన్‌ జీహెచ్‌ఎంసీ)లో 218, మేడ్చల్‌(నాన్‌ జీహెచ్‌ఎంసీ)లో 218 కేసులు రాగా, కరీంనగర్‌‌, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్‌, జగిత్యాల్, మంచి ర్యాల్, సూర్యాపేట్, సిద్ధిపేట్ జిల్లాల్లో 100కు పైగా చొప్పున కేసులు నమోదయ్యాయి. కొత్తగూడెం, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌‌, కామారెడ్డి, వన పర్తి జిల్లాల్లో 50కిపైగా చొప్పున కేసులు వచ్చినయి. మిగిలిన జిల్లాల్లో 50 కంటే తక్కువ కేసులు నమోదై నట్టుబులెటిన్‌లో పేర్కొన్నారు. వీటితో కలిపి రాష్ట్రం లో కరోనా కేసుల సంఖ్య 1,17,415కు పెరిగింది. ఇందులో 87,675 మంది కోలుకోగా, ప్రస్తుం 28,941 యాక్టివ్ క్టి పేషెంట్లుఉన్నట్టుఆరోగ్యశాఖ వెల్ల డించింది. యాక్టివ్ క్టి పేషెంట్లలో 22,097 మంది హోమ్‌, ఇనిస్టిట్యూషనల్ ఐసోలేషన్‌లో ఉండగా, 6,844 మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖాన్లలో చికిత్స పొందుతున్నారు.

799కి చేరిన మరణాలు

సర్కార్ లెక్కల ప్రకారం కరోనా మరణాల సంఖ్య 799కి చేరుకుంది. గురువారం 11 మంది చనిపో యారని, మొత్తంమరణాల సంఖ్య799కి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొన్నారు. కరోనా టెస్టుల సంఖ్య 12 లక్షలు దాటింది. గురువారం 61,863 మందికి టెస్ట్ చేసినట్టుఆరోగ్యశాఖ ప్రకటించింది. వీటితో కలిపి టెస్టుల సంఖ్య 12,04,343కు పెరిగింది. ఇందులో 1,075 మంది టెస్ట్ రిజల్ట్ పెండింగ్ లో ఉంది.

Tagged Telangana, corona, ventilators, 1479 lives

Latest Videos

Subscribe Now

More News