తెలంగాణలో1,492 కరోనా కేసులు,13 మంది మృతి

తెలంగాణలో1,492 కరోనా కేసులు,13 మంది మృతి

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,19,464 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,492 పాజిటివ్ కేసులుగా నిర్ధారణ అయ్యాయి. దీనికి సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం సాయంత్రం బులెటిన్‌ను విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా GHMC పరిధిలో 166 మందికి కరోనా నిర్ధారణ కాగా.. ఖమ్మం జిల్లాలో 129, నల్గొండ జిల్లాలో 115 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 1 కేసు నమోదైంది.

రాష్ట్రంలో 1,933 మంది కరోనా నుంచి కోలుకోగా.. 13 మంది చనిపోయారు. ప్రస్తుతం  తెలంగాణలో ఇప్పటివరకు 3,534 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటిదాకా 6,09,417 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 5,86,362 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 19,521 మంది ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.