కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి

కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి

మధిర, వెలుగు:  కాంగ్రెస్​ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ సీఎం సతీమణి, అమ్మ పౌండేషన్​ చైర్​ పర్సన్​​ మల్లు నందిని అన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క క్యాంప్ ఆఫీసు మధిరలో బుధవారం మల్లు నందిని  సమక్షంలో మధిర మండలం మహాదేవపురం గ్రామ కాంగ్రెస్ నాయకులు నల్లపు ప్రసాద్ 

ఆధ్వర్యంలో  మహదేవపురం గ్రామం నుంచి 15 కుటుంబాలు వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్​ కండువా కప్పి కాంగ్రెస్​ పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వేమిరెడ్డిశ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్,  నాయకులు పాల్గొన్నారు.