జమ్ములో ఉగ్రవాదుల కుట్ర భగ్నం

జమ్ములో ఉగ్రవాదుల కుట్ర భగ్నం

భద్రతా దళాల అలర్ట్ తో జమ్ములో భారీ ప్రమాదం తప్పింది. ఉగ్రవాదులు భారీ ఉగ్ర దాడికి రూపొందించిన కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. బస్టాండ్‌ సమీపంలో పార్క్‌ చేసిన బస్‌ నుంచి భద్రతా దళాలు మంగళవారం 15 కేజీల ఆర్టీఎక్స్‌ను స్వాధీనం చేసుకోవడంతో పెనుముప్పు తప్పింది.

కథువా జిల్లా బిలావర్‌ నుంచి జమ్ముకు ఈ బస్సు వచ్చిందని అధికారులు తెలిపారు. బస్‌ డ్రైవర్‌, కండక్టర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆర్డీఎక్స్‌  దొరకడంపై ప్రశ్నిస్తున్నారు. ఆర్డీఎక్స్‌తో ఉన్న ప్యాకెట్‌ను బిలావర్‌లో తమకు ఓ జంట అప్పగించిందని బస్‌ డ్రైవర్‌ భద్రతా దళాలకు చెప్పినుట్ల తెలిసింది. ఇటీవల బిలావాల్‌లోని దేవల్‌ ప్రాంతంలో ఓ ఇంటి నుంచి 40కిలోల గన్‌ పౌడర్‌ను అధికారులు స్వాదీనం చేసుకున్నారు.