బెట్టియా/మోతిహరి/మధుబని: లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైనికుల కులం, మతం గురించి తెలుసుకోవాలని చూస్తున్నందుకు సిగ్గుపడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. సైనికుల్లో కులం లేదా మతం ఆధారంగా వివక్ష లేదని స్పష్టం చేశారు. గురువారం అమిత్షా బిహార్లోని మధుబని, పశ్చిమ చంపారన్, మోతిహరి జిల్లాల్లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో మాట్లాడారు.
బంగ్లాదేశ్ నుంచి చట్టవిరుద్ధంగా వచ్చిన చొరబాటుదారులు ఇక్కడి ఉద్యోగాలు కొట్టేస్తున్నారని.. వారు దేశభద్రతకు ముప్పు అన్నారు. రాహుల్ గాంధీ మంగళవారం బిహార్లో నిర్వహించిన ఎన్నికల సభలో మాట్లాడుతూ, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు, సైన్యం, న్యాయవ్యవస్థ, అధికార వ్యవస్థలో జనాభాలో 10 శాతం మాత్రమే ఉన్న అగ్రకులాల ఆధిపత్యం ఉందని, వారే వాటిని నడుపుతున్నారని అన్నారు. దేశంలో 90 శాతం ఉన్న దళితులు, ఆదివాసీలు, దిగువ కులాలు, వెనుకబడిన వర్గాలవారు ఉన్నత స్థానాలు పొందలేక నష్టపోతున్నారని అమిత్ షా పేర్కొన్నారు.
