విద్య, ఉద్యోగాల్లో మాలలకు అన్యాయం.. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించాలని డిమాండ్

విద్య, ఉద్యోగాల్లో మాలలకు అన్యాయం.. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించాలని డిమాండ్

బషీర్​బాగ్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ కారణంగా ఎస్సీలోని 58 కులాల వారు 5 నెలలుగా విద్య, ఉద్యోగ రంగాల్లో అన్యాయానికి గురవుతున్నారని మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్  ఆవేదన వ్యక్తం చేశారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గురువారం ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించాలని, మాలలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని, 20 లోపు రెండు రోస్టర్ పాయింట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ వల్ల మాలలు అన్ని రంగాల్లో తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.