Malaika Arora: పెళ్లితో పన్లేదు.. 52 ఏళ్ల వయసులో 30 ఏళ్ల కుర్రాడితో డేటింగ్!

Malaika Arora: పెళ్లితో పన్లేదు.. 52 ఏళ్ల వయసులో 30 ఏళ్ల కుర్రాడితో డేటింగ్!

నిజ జీవితంలో బోల్డ్ నిర్ణయాలు, వివాదాల పట్ల నిర్భయమైన వైఖరితో బాలీవుడ్‌లో ఎప్పుడూ వార్తల్లో ఉండే నటీమణులలో మలైకా అరోరా ఒకరు. వయస్సు 50 దాటినా తన అందచందాలతో ఐటమ్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.  తన వ్యక్తిగత జీవితం గురించి ఏ మాత్రం దాపరికం లేకుండా మాట్లాడుతుందీ భామ. అయితే లేటెస్ట్ గా చేసిన కొన్ని వ్యాఖ్యలు , కొత్త డేటింగ్ ఊహాగానాలతో మరోసారి బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిందీ  ముద్దుగుమ్మ .

 పెళ్లితో పనిలేదు..

నటుడు అర్బాజ్ ఖాన్ నుండి విడిపోయిన తర్వాత, తనకంటే దాదాపు 12 ఏళ్లు చిన్నవాడైన యువ నటుడు అర్జున్ కపూర్ తో మలైకా సహజీవనం చేసింది. వీరిద్దరూ బహిరంగంగా తిరగడం, తమ సంబంధాన్ని ధైర్యంగా అంగీకరించడం బీ-టౌన్‌లో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా, గతంలో ఒక ఇంటర్వ్యూలో మలైకా చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం సృష్టించాయి.

లేటెస్ట్ గా..  మలైకా తన వ్యక్తిగత జీవితం, స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. 'ప్రతి వ్యక్తికి తన జీవితాన్ని తన ఇష్టం మేరకు జీవించే హక్కు ఉంది. మనసుకు నచ్చిన వ్యక్తితో శృంగారం చేయడం ఏ మాత్రం తప్పు కాదు. దీనికి తప్పనిసరిగా పెళ్లి కావాల్సిన అవసరం లేదు. ఎంత స్వేచ్ఛగా, సంతోషంగా జీవించాము అన్నదే ముఖ్యం' అని ఆమె చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

30 ఏళ్ల కుర్రాడితో డేటింగ్..

అర్జున్ కపూర్‌తో బ్రేకప్ తర్వాత మలైకా కొంతకాలం పాటు డేటింగ్ జీవితానికి దూరంగా ఉంది. కానీ, ఇటీవల ముంబైలో జరిగిన ఒక ప్రముఖ పబ్లిక్ ఈవెంట్‌లో ఆమె కనిపించిన తీరు మరో కొత్త ఊహాగానాలకు దారి తీసింది. ముంబైలో జరిగిన ప్రఖ్యాత పాప్ సింగర్ ఎన్రిక్ ఇగ్లేసియాస్ కచేరీలో 52 ఏళ్ల మలైకా అరోరా, తనకంటే దాదాపు 23 ఏళ్లు చిన్నవాడైన 30 ఏళ్ల యువకుడితో కలిసి కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. 

ఈవెంట్‌లో మలైకా ఎంతో హుషారుగా, ఉల్లాసంగా, నృత్యం చేస్తూ, పాప్ స్టార్ పాటలకు హమ్ చేస్తూ గడిపింది. ఆ యువకుడు ఆమె చెంతనే ఉండటం, ఇద్దరూ చాలా సరదాగా గడపడం చూసి, హిందీ మీడియాలో 'ఎవరీ మిస్టరీ మ్యాన్?' అంటూ కథనాలు వెల్లువెత్తాయి. ఆ యువకుడు మలైకా కొత్త డేటింగ్ భాగస్వామి అయి ఉంటాడని చాలామంది భావిస్తున్నారు.  మలైకా తన ప్రేమ, డేటింగ్ జీవితం గురించి ఏ మాత్రం దాచుకోకుండా ఉండటమే ఆమెను ఎప్పుడూ వార్తల్లో నిలబెడుతుంది. ఆమె తదుపరి అడుగు ఏమిటనేది తెలుసుకోవడానికి అభిమానులు, సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి..