యూకేలో స్టడీ టూర్ కు వెళ్లిన 15 మంది డిగ్రీ విద్యార్థులు

యూకేలో స్టడీ టూర్ కు వెళ్లిన 15 మంది డిగ్రీ విద్యార్థులు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న 15 మంది విద్యార్థినీలకు గొప్ప అవకాశం దక్కింది. యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)లో స్టడీ టూర్ కు వెళ్లే చాన్స్ వచ్చింది. యూకేకు వెళ్లి రెండు వారాలు జరిగే స్టడీ టూర్‌లో భాగంగా అత్యుత్తమ అండర్ గ్రాడ్యుయేట్ టాలెంట్ (స్కౌట్) స్కాలర్‌షిప్‌లలో పాల్గొనే అవకాశం లభించింది.

తెలంగాణ ప్రభుత్వం, బ్రిటీష్ కౌన్సిల్ మధ్య కార్యాచరణ కూటమి ఒప్పందంలో భాగంగా ఈ అవకాశం లభించింది. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన బాలికలకు ఈ అవకాశం లభించింది . ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుంచి ఐదుగురు, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల నుంచి ఆరుగురు, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల నుంచి నలుగురు మెరిట్ ప్రాతిపదికన టూర్‌కు ఎంపికయ్యారు. ఈ 15 మంది విద్యార్థులు మార్చి 26వ తేదీ లండన్ బయలుదేరి వెళ్లారు. ఇంగ్లాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్కో, యూనివర్సిటీ ఆఫ్ స్కాట్లాండ్ ను సందర్శించనున్నారు. అక్కడ ప్రొఫెసర్లను, స్కాలర్స్ ను.. రీసెర్చ్ స్టూడెంట్స్ తో వీరు ఇంటరాక్ట్ కానున్నారు.