ఎంపీగా గెలిపిస్తే స్థానిక సమస్యలు పరిష్కరిస్తా : దానం నాగేందర్

ఎంపీగా గెలిపిస్తే స్థానిక సమస్యలు పరిష్కరిస్తా : దానం నాగేందర్
  • సికింద్రాబాద్ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్

సికింద్రాబాద్, వెలుగు : ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్​పార్టీకి ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి చెప్పారు. తార్నాక డివిజన్ మాణికేశ్వరీనగర్​శ్రీరామ గండికోట సొసైటీకి చెందిన 150 మంది సభ్యులు గురువారం సికింద్రాబాద్ కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్​సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు.

తనను ఎంపీగా గెలిపిస్తే స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఆరు గ్యారంటీలు అందేలా చూస్తానని తెలిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో వందేళ్లలో జరిగే అభివృద్ధిని పదేండ్లలో చేసి చూపుతామని చెప్పారు. అంతకు ముందు తార్నాక డివిజన్ లోని ఇసుక బావి,  ఇందిరానగర్, బుగ్గల బస్తీ, చంద్రబాబు నాయుడు నగర్

సత్తిరెడ్డి నగర్, ఓల్డ్ లాలా పేట, లాలాపేటలోని గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లల్లో నివసిస్తున్న బస్తీ వాసులను ఆప్యాయంగా పలకరించారు. ఆయనతో తెలంగాణ కార్మిక విభాగం అధ్యక్షుడు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మోతె శోభన్ రెడ్డి, ఆదం సంతోశ్​కుమార్, స్థానిక సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.