డబుల్ బెడ్ రూం పేరుతో 150మందికి కుచ్చుటోపీ

డబుల్ బెడ్ రూం పేరుతో 150మందికి కుచ్చుటోపీ

డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయిస్తనంటూ అటార్నీ జనరల్ ఆఫీస్ రికార్డు అసిస్టెంట్ బాలరాజు  తమ నుంచి డబ్బులు వసూలు చేశాడంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం ప్రకారం.. డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇప్పిస్తాననే మాట ఇచ్చి 150 మంది నుంచి దాదాపు  రూ.70వేలు చొప్పున బాలరాజు వసూలు చేశాడు.  ఈ వ్యవహారంలో బాలరాజుకు సరూర్ నగర్ కు చెందిన రాజు (ఆటో డ్రైవర్), మరో హౌసింగ్ సొసైటీ ఉద్యోగి ఆనంద కిషోర్ లు సహకరించారని బాధితులు ఆరోపిస్తున్నారు.

తమ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని బాధితులు బాలరాజును  నిలదీశారు. అతడు ఎంతకూ స్పందించకపోవడంతో సరూర్ నగర్  పోలీసు స్టేషన్ లో అప్పగించారు. బాలరాజు నుంచి  తమ డబ్బులు ఇప్పించాలని  పోలీసులకు మొరపెట్టుకున్నారు. మరోవైపు బాలరాజు మాత్రం తాను 40 లక్షల రూపాయలను ఆనంద కిషోర్ కు ఇచ్చానని పోలీసులకు చెబుతుండటం గమనార్హం. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఈ వ్యవహారంలో బాలరాజుకు సహకరించిన ఇంకొందరిని  కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.