యాదాద్రి, వెలుగు: కుంభం ఫౌండేషన్, 1ఎం1బీ సంయుక్తంగా నిర్వహించిన మేగా జాబ్‌మేళాలో 1,550 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, ఫౌండేషన్ చైర్మన్ కుంభం కీర్తిరెడ్డి ఆదివారం నియమామక పత్రాలు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 3,500 మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించాలన్న ఉద్దేశంతో జాబ్ మేళా నిర్వహించామని చెప్పారు.
మొత్తం వచ్చిన అభ్యర్థులకు స్క్రీనింగ్ నిర్వహిస్తే 1,900 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారని, 25 కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 1,550 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు. రానున్న రోజుల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తామని, మరింత మందికి ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని చెప్పారు.
