
గచ్చిబౌలి దారుణం జరిగింది. నాగేశ్వరి అనే 16 సంవత్సరాల బాలిక ముళ్ల పొదల్లో శవమై కనిపించింది. ఈ ఘటన మసీద్‌బండలో జరిగింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు.. నాగేశ్వరి నిన్న సాయంత్రం నుంచి కనిపించడం లేదు. నాగేశ్వరి మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు చుట్టు పక్కల వారిని అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. నాగేశ్వరి శరీరంపై గాయాలుండటం చూస్తే.. ఇది హత్య అనే అనుమానాలు కలుగుతున్నాయి.
సంబంధిత వార్తల కోసం..