
ముంబై: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ వ్యూయర్ షిప్ రికార్డులను బద్దలుకొట్టింది. అక్టోబర్ 24న జరిగిన ఈ మెగా మ్యాచ్‌ను ఏకంగా 16 కోట్ల 70 లక్షల మంది చూశారని టోర్నీ అఫీషియల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ ఇండియా వెల్లడించింది. వ్యూయర్‌షిప్ పరంగా ఒక టీ20 మ్యాచ్‌కు ఇదే ఆల్‌టైమ్ రికార్డ్ అని తెలిపింది. దీంతో, 2016 టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇండియా, వెస్టిండీస్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ను నాడు 13.60 కోట్ల మంది చూశారు. ఇప్పుడు ఇండో–పాక్ మ్యాచ్ ఆ రికార్డును బ్రేక్ చేసింది.