పద్మారావునగర్, వెలుగు: ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రూ.18 లక్షల విలువైన గంజాయిని హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని బరంపూర్ జిల్లాకు చెందిన రాహుల్ సేతి 17.42 కిలోల గంజాయితో శనివారం రైలులో సికింద్రాబాద్ చేరుకున్నాడు.
దాన్ని నాందేడ్‌కు చెందిన వ్యక్తులకు అప్పగించేందుకు రైల్వేస్టేషన్ సమీపంలో వేచి ఉండగా.. అధికారులు పక్కా సమాచారంతో వెళ్లి, అతన్ని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎక్సైజ్ ఎస్సైలు శ్రీనివాస్, రూప, భూపాల్, సిబ్బంది పాల్గొన్నారు
