బలూచిస్తాన్‌‌లో 18 మంది కార్మికుల కిడ్నాప్

బలూచిస్తాన్‌‌లో 18 మంది కార్మికుల కిడ్నాప్
  • గనిలోకి చొరబడి కార్మికులను ఎత్తుకెళ్లిన కిడ్నాపర్లు

కరాచీ: పాకిస్తాన్‌‌లోని బలూచిస్తాన్‌‌లో మార్బుల్ మైనింగ్ సైట్‌‌పై దుండగులు దాడి చేసి 18 మంది కార్మికులను కిడ్నాప్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున ఖుజ్దార్ జిల్లాలోని నాల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దాడిలో ఓ కార్మికుడికి గాయాలయ్యాయి. శనివారం ఇదే బలూచిస్తాన్‌‌లో బస్సును హైజాక్ చేసి 20 మంది ట్రైనీ పోలీసులను దుండగులు కిడ్నాప్ చేశారు. ఖుజ్దార్ జిల్లాలోని మారుమూల నాల్ ప్రాంతంలో ఉన్న మార్బుల్ గని వద్దకు బైక్‌‌లు, ఇతర వాహనాల్లో గుర్తుతెలియని దుండగులు వచ్చారు.

తుపాకులతో మైనింగ్ సైట్‌‌లోకి చొరబడి కాల్పులు జరిపారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులను చుట్టుముట్టి 18 మందిని బలవంతంగా తమ వెంట తీసుకెళ్లారు. ఈ దాడిలో కిడ్నాప్‌‌కు గురైన వారిలో ఎక్కువ మంది సమీప ప్రాంతాలకు చెందినవారని పోలీసులు తెలిపారు.