
సైబీరియాలోని ఏ మంచు ఎడారిలో 18 వేల ఏళ్ల క్రితం చనిపోయిన కుక్కను శాస్త్రవేత్తలు గుర్తించారు. మంచులోకి తల భాగం వరకు కూరుకు పోయి ఉంది.దాంతో తల భాగం వరకు చెక్కు చెదరకుండా ఉంది.
ఇక ఇతర శరీర భాగం మాత్రం స్వల్పంగా కుల్లిపోయింది.పలు పరిశోధనలు చేసిన తర్వాత శాస్త్రవేత్తలు ఈ కుక్క 18 వేల ఏళ్ల క్రితంకు చెంది ఉంటుందని గుర్తించారు. ఈ కుక్కపై ప్రస్తుతం అక్కడి శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు.మరో వైపు ఇది కుక్కనా లేదా ఒకప్పటికి తోడేలా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది.
మనిషి శరీరం అయినా, జంతువు శరీరం అయినా కూడా చనిపోయిన వారం పది రోజుల్లోనే కుళ్లి పోతుంది.కొన్ని సార్లు తప్పనిసరి పరిస్థితుల్లో డెడ్ బాడీని అలాగే ఉంచడం కోసం ఐస్ బాక్స్‌లో పెట్టడం జరుగుతుంది. కాని అది కూడా చాలా కాలం ఉండటం కష్టం.అనాధ శవాలను కొన్ని వారాలు లేదా నెలల పాటు బాక్స్‌లో ఉంచి ఆ తర్వాత దాన్ని ఖననం చేస్తారు. అలా ఇప్పటి వరకు ఎన్నో శరీరాలను ఉంచి ఖననం చేశారు.ఈజిప్ట్‌లో శరీరాలను ఖననం చేసే సమయంలో రసాయనాలు ఉపయోగించి అవి చెడిపోకుండా ఉండేలా ప్రయత్నాలు చేస్తారు. ఐస్ బాక్స్‌లో పెట్టిన ఎక్కడ ఉంచినా కూడా శరీరం అనేది మెల్లగా కుళ్లి పోవడం ఖాయం. కాని ఆమద్య పూరి జగన్నాధ్ మెహబూబా సినిమాలో చూపించినట్లుగా హీరోయిన్ శవం మంచు కొండల్లో ఉండటంతో అలాగే ఉంది.చాలా ఏళ్లు అయినా కూడా మంచు కొండల్లో ఉండటం వల్ల ఆ శరీరం అలాగే ఉండి పోయింది.అది సినిమా కాబట్టి అలా ఉంది అనుకున్నాం.కాని దాదాపుగా 18 వేల ఏళ్ల నాటి ఒక కుక్క శవంను శాస్త్రవేత్తలు గుర్తించారు.
2019లో సైబీరియాలోని మంచు గడ్డల్లో శాస్త్రవేత్తలకు ఓ జంతువు కళేబరం దొరికింది. దానిపై పరిశోధనలు చేసిన లవ్ డేలన్, డేవ్ స్టాంటన్ శాస్త్రవేత్తల ద్వయం అది కుక్క లేక తోడేలా అన్నది కనుక్కోలేకపోయారు. కార్చన్‌డేటింగ్ పరీక్షల్లో అది 18 వేల ఏళ్ల నాటి దని తెలిసి ఆశ్చర్యపోయారు. వేల ఏళ్లు గడుస్తున్నా ఆ జంతువు ఇంకా భద్రంగా ఉంది. దాని పళ్లు, ఇతర శరీర అవయవాలు అన్నీ అలానే ఉన్నాయి. దానికి వారు డోగర్ అని పేరు పెట్టారు. వేల సంవత్సరాలుగా ఖననం చేయబడినప్పటికీ, దాని శరీర వెంట్రుకలు, ముక్కు , దంతాలు సురక్షితంగా ఉన్నాయి. ఆ కాలంలో కుక్కలు , తోడేళ్ళు ఒకే జాతికి చెందినవని వాటి DNA సీక్వెన్సింగ్ చూపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు.
శాస్త్రవేత్తలకు ఇన్ని రోజులు అర్థం కాకుండా మిగిలిపోయిన ప్రశ్నకు తాజాగా సమాధానం దొరికింది. 18 వేల ఏళ్ల నాటి మిస్టరీ వీడింది. పరిశోధకుల నాలుగేళ్ల కష్టానికి ప్రతిఫలం దొరికింది. సైబేరియా మంచు గడ్డల్లో దొరికిన ఆ జంతువు ఏంటో తెలిసిపోయింది. డోగర్‌గా పిలవబడుతున్న ఆ జంతువు కుక్క కాదట. అది ఓ తోడేలని శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. ఆ తోడేలుకు అప్పటి కుక్కలతో కొద్దిగా కూడా దగ్గరి సంబంధం లేదని తేల్చారు. అది కుక్కా లేకా తోడేలా అని కనుక్కోవటానికి 72 కుక్కలు,72 తోడేళ్ల జీన్స్‌పై పరిశోధనలు చేశారు. ఈ సమయంలోనే అది కుక్క కాదని, తోడేలు జాతికి చెందిందని తేలిందని . పురాతన జీన్స్‌పై పరిశోధనలు చేస్తున్న లండన్‌కు చెందిన ప్రముఖ పరిశోధకుడు ఆండర్స్ బెర్గమ్‌స్టార్మ్ తెలిపారు. కుక్కలు పశ్చిమ యురేషియాలోని పురాతన తోడేళ్ళతో పోలిస్తే తూర్పు యురేషియాలోని పురాతన తోడేళ్ళతో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తల బృందం కనుగొంది.