టెన్త్ పరీక్షలకు తొలిరోజు 1,838 మంది ఆబ్సెంట్

టెన్త్  పరీక్షలకు  తొలిరోజు 1,838 మంది ఆబ్సెంట్

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. సోమవారం తొలి రోజు ఫస్ట్ లాంగ్వేజీ పరీక్షలు జరగగా.. 1,838 మంది హాజరుకాలేదు. రెగ్యులర్ స్టూడెంట్లు 4,94,877 మందికి గానూ.. 4,93,417 మంది ఎగ్జామ్ రాశారు. ప్రైవేటు విద్యార్థులు 1,261 మందికిగానూ 883 మంది అంటెడ్ అయ్యారు. తొలిరోజు నాలుగు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్ లో ఇద్దరు, ఖమ్మంలో ఒక ఇన్విజిలేటర్ ను విధుల నుంచి తప్పించారు.  ఉదయం 9.30గంటలకు పరీక్షలు ప్రారంభం కాగా, సెంటర్లకు 8గంటల నుంచే స్టూడెంట్ల రాక మొదలైంది.  తొలిరోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పరీక్ష విభాగం డైరెక్టర్ కృష్ణారావుపేర్కొన్నారు.