పార్టీ ఫిరాయింపు కేసులో ఎమ్మెల్యే సంజయ్ కి క్లీన్ చిట్

పార్టీ ఫిరాయింపు కేసులో ఎమ్మెల్యే సంజయ్ కి క్లీన్ చిట్

పార్టీ ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ వచ్చింది.  జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనర్హత పిటిషన్ ను స్పీకర్ కొట్టివేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పిటిషన్ వేశారు. ఫిబ్రవరి 4న అనర్హత పిటిషన్ పై  విచారణ జరపగా ఎమ్మెల్యే సంజయ్  పార్టీ మారినట్టు తగిన ఆధారాలు లేవంటూ అనర్హత పిటిషన్ ను కొట్టివేశారు స్పీకర్ . ఫిరాయింపుల కేసులో ఇప్పటి వరకు  8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు.

ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి,పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలెయాదయ్య, ఇపుడు  సంజయ్ కుమార్ లకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇంకా కడియం శ్రీహరి, దానం నాగేందర్ విచారణ పెండింగ్ లో ఉంది. 

నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే

నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే.  బీఆర్ఎస్ నుంచి  గెలిచిన. నా జీతం నుంచి  నెలకు  5000 రూపాయలు బీఆర్ఎస్  పార్టీకి కట్టవుతున్నాయి.  అసెంబ్లీ లో  బీఆర్ఎస్ బిల్లులు ప్రవేశపెట్టి, విప్ జారీ చేస్తే నేను మద్దతు ఇస్తా. నేనెప్పుడూ బీఆర్ఎస్ ను,   అధిష్టానని విమర్శించలేదు.  స్థానిక  BRS  నాయకత్వం నాకు దూరంగా ఉంది.  నాది ఎలక్షన్ కోసం కాదు అభివృద్ధి కోసం ఆరాటం .   నాతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా ఇండిపెండెంట్ అభ్యర్థుల  కోసం ప్రచారం చేస్తా.  నేను జగిత్యాల  అభివృద్ధి కోసం సీఎంతో, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్న . జగిత్యాల అభివృద్దే నా ఆరాటం. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా , జగిత్యాల అభివృద్ధికి మద్దతుగా ఉన్న  అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపించండి.  జగిత్యాల పట్టణాన్ని ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తా. జగిత్యాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కోసం కలిసి పని చేస్తున్నా అని అన్నారు. 

►ALSO READ | ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్టీసీకి మేడారం జాతర ఆదాయం రూ.3.28 కోట్లు