హుజురాబాద్ ఉప ఎన్నిక: 19 నామినేషన్లు తిరస్కరణ

హుజురాబాద్ ఉప ఎన్నిక: 19 నామినేషన్లు తిరస్కరణ

హుజురాబాద్ ఉప ఎన్నిక ఈ నెల 30న జరగనుంది. ఈ క్రమంలో ఇటీవల నామినేషన్లు సమర్పించగా..ఇవాళ పరిశీలన చేపట్టారు అధికారులు. 61 మంది నామినేషన్లలో 19 తిరస్కరించామన్నారు హుజురాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి. ఎన్నికల బరిలో ప్రస్తుతం 42 మంది అభ్యర్ధులు ఉన్నారని తెలిపారు. ఈనెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని చెప్పారు. అదే రోజు ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తామన్నారు.

తిరస్కరించిన వారిలో .. రాజేందర్ పేరుతో ఉన్న ముగ్గురి నామినేషన్లు కూడా ఉన్నాయన్నారు. ఇప్పలపల్లి రాజేందర్, ఈసంపల్లి రాజేందర్, ఇమ్మడి రాజేందర్ అనే ఈ ముగ్గురు ఇతర జిల్లాలకు చెందినవారని తెలుస్తోంది.