54  ఏళ్ల తర్వాత కలుసుకున్నరు

54  ఏళ్ల తర్వాత కలుసుకున్నరు

ముషీరాబాద్, వెలుగు: 1969 సంవత్సరానికి  చెందిన పదోతరగతి పూర్వవిద్యార్థుల సమ్మే ళనం ఆదివారం నారాయణగూడలోని తాజ్‌మహల్‌ హోటల్‌లో వైభవంగా జరిగింది.  మలక్ పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల1969 బ్యాచ్‌ పదో తరగతి పూర్వ విద్యార్థులు 54  ఏళ్ల తర్వాత కలుసుకున్నారు.  గత స్మృతులను గుర్తు చేసుకున్నారు.  పూర్వ విద్యార్థులందరూ కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం ఎంతగానో ఆకట్టుకుంది.

పూర్వ విద్యార్థులు పార్థసారథి, షణ్ముఖ దీప్ కుమార్, సివీ లక్ష్మీ,  సి.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.  ప్రస్తుతం  వారి కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ నేపథ్యాలను కష్ట సుఖాలను పంచుకున్నారు.  ఆత్మీయ సమ్మేళనం ద్వారా పూర్వ విద్యార్థులందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి ఇలా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.