
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ టీ20 ఫార్మాట్ లో తన విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ వైటాలిటీ టీ20 బ్లాస్ట్ లీగ్ లో లాంక్షైర్ తరపున ఆడుతున్నాడు. ఈ లీగ్ లో అద్భుత ఫామ్ లో ఉన్న బట్లర్ ఒక మైలురాయిని చేరుకున్నాడు. టీ20 క్రికెట్ లో 13000 పరుగులు పూర్తి చేసిన అరుదైన లిస్ట్ లో చేరిపోయాడు. ఇప్పటివరకు 13 వేల క్లబ్ లో ఆరుగురు ఉండగా.. తాజాగా బట్లర్ ఈ మైల్ స్టోన్ చేరుకొని ఏడో ప్లేయర్ గా అవతరించాడు. గురువారం (జూలై 17) యార్క్‌షైర్‌తో జరిగిన వైటాలిటీ టీ20 బ్లాస్ట్ మ్యాచ్‌లో భాగంగా బట్లర్ ఈ ఘనతను అందుకున్నాడు.
మాజీ ఇంగ్లాండ్ ఓపెనర్ ఓపెనర్ (13814) అలెక్స్ హేల్స్ తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న రెండో ఆటగాడిగా బట్లర్ నిలిచాడు. ఓవరాల్ గా ఓవరాల్ గా ఈ లిస్ట్ లో వెస్టిండీస్ సిక్సులు వీరుడు క్రిస్ గేల్ (14,562) అగ్ర స్థానంలో ఉన్నాడు. కీరన్ పొలార్డ్ (13854), అలెక్స్ హేల్స్ (13,704), షోయబ్ మాలిక్ (13,571) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ లో 397 ఇన్నింగ్స్ ల్లో 13,543 పరుగులు చేసి ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో 13000+ పరుగులు చేసిన ఏకైక యాక్టివ్ క్రికెటర్ బట్లర్.
ALSO READ : IND vs ENG 2025: నా జెర్సీ మీద పడ్డావేంటి గురు.. మరోసారి కోహ్లీ 18 నెంబర్ ధరించిన వైభవ్
34 ఏళ్ల బట్లర్ ఈ ఏడాది తొమ్మిది యాభైకి పైగా స్కోర్లు సాధించాడు. ఇటీవలే ఐపీఎల్ లో అదరగొట్టి.. ప్రస్తుతం జరుగుతోన్న వైటాలిటీ టీ20 బ్లాస్ట్ లోనూ సత్తా చాటుతున్నాడు. బట్లర్ బ్యాటింగ్ తో యార్క్‌షైర్‌తో జరిగిన మ్యాచ్ లో లాంక్షైర్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లాంక్షైర్, బట్లర్ హాఫ్ సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో యార్క్‌షైర్ 153 పరుగులకే పరిమితమైంది.
టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు
*క్రిస్ గేల్ - 14562
*కీరాన్ పొలార్డ్ - 13854
*అలెక్స్ హేల్స్ - 13814
*షోయబ్ మాలిక్ - 13571
*విరాట్ కోహ్లీ - 13543
*డేవిడ్ వార్నర్ - 13395
*జోస్ బట్లర్ - 13046
Jos Buttler became only the second Englishman to cross 13k T20 runs during his match-winning 77(46) in the Vitality Blast yesterday 👏 pic.twitter.com/0Uaj9vNiNJ
— ESPNcricinfo (@ESPNcricinfo) July 18, 2025