ఆదిలాబాద్ జిల్లాలో జిమ్లో డ్రగ్స్, స్టెరాయిడ్స్.. సీజ్ చేసిన పోలీసులు !

ఆదిలాబాద్ జిల్లాలో జిమ్లో డ్రగ్స్, స్టెరాయిడ్స్.. సీజ్ చేసిన పోలీసులు !


డ్రగ్స్ మహమ్మారి నగరాల నుంచి జిల్లాలకు పాకింది. జిమ్ కల్చర్ లో భాగంగా యువతకు డ్రగ్స్ ను పరిచయం చేస్తున్నారు దుండగులు. బాడీ బిల్డింగ్ కోసం ప్రయత్నించే యూత్ కు లేని పోని ఆశలు కల్పించి డ్రగ్స్ కు బానిసల్ని చేస్తున్నారు. ఇవి వాడితే మంచి బాడీ వస్తుందని.. కండలు తిరిగిన దేహం కావాలంటే ఇవి వాడాలని చెప్పి అలవాటు చేస్తున్నారు. 

శుక్రవారం (జులై 18) ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో డ్రగ్స్ దందా గుట్టు రట్టు చేశారు అధికారులు. లయన్  జిమ్ లో  డ్రగ్    అమ్మకాలు జరుగుతున్నాయని తెలుసుకున్న పోలీసులు.. మధ్యాహ్నం తర్వాత సోదాలు నిర్వహించారు. పోలీసుల సోదాల్లో భారీగా డ్రగ్స్ స్టెరాయిడ్స్ బయటపడ్డాయి. 

అక్రమంగా తెప్పించిన డ్రగ్స్, స్టెరాయిడ్స్, విటమిన్ ట్యాబ్లెట్స్ పేరున అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ దందా నడిపిస్తున్న జిమ్  ను పోలీసులు  సీజ్ చేశారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారో.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసుల విచారణ  కోనసాగుతోంది.