
అబ్దుల్లాపూర్‌మెట్, వెలుగు: సిటీ శివారులో భారీ మొత్తంలో క్యాష్ పట్టుబడింది. హయత్ నగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సిటీ నుంచి చౌటుప్పల్ వైపు వెళ్తున్న ఓ కారును పెద్దఅంబర్‌పేట ఓఆర్ఆర్ సమీపంలో ఎల్బీనగర్, హయత్‌నగర్ ఎస్వోటీ పోలీసులు అడ్డుకుని తనిఖీ చేశారు. అందులో రూ.2 కోట్లు క్యాష్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని.. ఆ క్యాష్ ఎవరికి చెందినది, ఎక్కడికి తరలిస్తున్నారనే వివరాలను తొందరలోనే తెలియజేస్తామని ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టుబడ్డ క్యాష్‌ను ఎన్నికల అధికారులకు అప్పగించామన్నారు.
షాహినాయత్ గంజ్‌లో రూ.98 లక్షలు
మెహిదీపట్నం: రెడ్ హిల్స్ ఏరియాలో ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి ముజీబ్ ఆఫీసులో రిజ్వాన్(23) వర్కర్‌గా పనిచేస్తున్నాడు. రిజ్వాన్ బుధవారం సాయంత్రం పురానాపూల్ వద్ద ఉండే ముజాహిద్‌కు డబ్బులు ఇచ్చేందుకు కారులో బయలుదేరాడు. జుమ్మెరాత్ బజార్ వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు అతడిని అడ్డుకున్నారు. కారును తనిఖీ చేసి రూ.98 లక్షలను గుర్తించారు. ఈ క్యాష్కు సంబంధించి రిజ్వాన్ సరైన పేపర్లు చూపించకపోవడంతో పోలీసులు ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు ఫైల్ చేశారు.