
న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) వెళ్లిపోవడం కొనసాగుతోంది. ఈ నెల 1–17 మధ్య రూ. 31,430 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లను అమ్మేశారు. యూఎస్ ఫెడ్ వేగంగా వడ్డీ రేట్లను పెంచుతుండడంతో పాటు ఇన్‌ఫ్లేషన్ రికార్డ్ లెవెల్స్‌కు చేరుకోవడంతో ఎఫ్‌ఐఐలు మన మార్కెట్‌లో షేర్లను అమ్మేస్తున్నారు. ఈ ఏడాదిలో రూ. 1.98 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లను ఎఫ్‌ఐఐలు వెనక్కి తీసేసుకున్నారు. యుద్ధం ఇంకా కొనసాగుతుండడం, ఇన్‌ఫ్లేషన్ , వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు మానిటరీ పాలసీలను కఠితనరం చేస్తుండడంతో ఎఫ్‌పీఐలు స్టాక్స్‌ను అమ్మేస్తున్నారు.