- ఎకానమీ 30 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడంలో వీరు కీలకం: ఐసీఎస్‌ఐ
హైదరాబాద్, వెలుగు : ఎకానమీ 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలని ప్రధాని మోదీ టార్గెట్‌గా పెట్టుకున్నారని , దీనిని సాధించడానికి సుమారు 2 లక్షల మంది కంపెనీ సెక్రెటరీలు (సీఎస్) అవసరమవుతారని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) పేర్కొంది . ప్రస్తుతం ఉన్న 72 వేల మంది కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. వివిధ సీఎస్ ప్రోగ్రామ్‌ల కోసం ప్రతీ ఏడాది 14 వేల మందిని జాయిన్ చేసుకుంటున్నామని, ఈ ఏడాది 25 వేల మందిని జాయిన్ చేసుకుంటామని అని ఐసీఎస్‌ఐ ప్రెసిడెంట్ సీఎస్ బీ నరసింహన్ అన్నారు.
దేశంలోని 141 యూనివర్సిటీలతో టై అప్ అయ్యామని వెల్లడించారు. ఉస్మానియా యూనివర్సిటీతో కూడా ఎంఓయూ కుదుర్చుకుంటామని అన్నారు. వచ్చే నెల 5–6 న మూడో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌ను సింగపూర్‌లో ఐసీఎస్‌ఐ నిర్వహించనుంది. సీఎస్ ప్రొఫెషనల్స్‌ను ఈ సంస్థ డెవలప్, రెగ్యులేట్ చేస్తోంది. కాగా, ఎన్‌సీఎల్‌టీకి సంబంధించి ఒక రోజు సెమినార్‌ను శనివారం నిర్వహించింది. కంపెనీలు ఏర్పాటు కావడంలో, వీటి ఆపరేషన్స్ సజావుగా జరగడంలో సీఎస్‌ల పాత్ర కీలకంగా ఉంటుంది.
