హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్ రన్.. : ఇద్దరు యువకులు మృతి

హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్ రన్.. : ఇద్దరు యువకులు మృతి

హైదరాబాద్ సిటీలో దారుణం జరిగింది. అర్థరాత్రి సమయంలో మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి ఇద్దరు యువకులు ఫొటోలు దిగుతుండగా.. గుర్తు తెలియని కారు ఒకటి వేగంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. అత్యంత వేగంగా కారు ఢీకొనటంతో.. స్పాట్ లోనే ఓ యువకుడు చనిపోగా.. మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. 26 ఏళ్ల అనీల్ ఒకరు కాగా.. మరో యువకుడిని గుర్తించాల్సి ఉంది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు.

ఈ ఘటనపై హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు.. ప్రమాదానికి కారణమైన కారును సీసీటీవీ పుటేజ్ ఆధారంగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తులపై చట్ట పరంగా కఠన చర్యలను తీసుకుంటామని తెలిపారు.