Mahesh Babu: ‘వారాణసి’ మీ ఊహకే వదిలేస్తున్నా.. స్పీచ్తో అదరగొట్టిన మహేష్ బాబు

Mahesh Babu: ‘వారాణసి’  మీ ఊహకే వదిలేస్తున్నా.. స్పీచ్తో అదరగొట్టిన మహేష్ బాబు

మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో "వారాణసి" రాబోతుంది. ఇన్నాళ్లు ‘SSMB 29’ వర్కింగ్‌‌‌‌ టైటిల్‌‌‌‌తో వినిపించింది. ఇక వారణాసిగా దర్శనం ఇవ్వబోతుంది. ఇవాళ (నవంబర్ 15న) వారణాసి టైటిల్ గ్లింప్స్‌‌‌‌, మహేష్ బాబు ఫస్ట్ లుక్‌‌‌‌ రిలీజ్ చేసి బిగ్ అప్డేట్ ఇచ్చారు. రుద్రుడిగా సాక్షాత్తూ పరమశివుడే నేలకు దిగి వచ్చాడా అనే విధంగా గ్లింప్స్‌‌‌‌ అదిరిపోయింది.

ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ సినిమాపై తనకున్న కాన్ఫిడెంట్ ఎలాంటిదో వివరించారు. ‘‘అప్డేట్.. అప్డేట్.. అప్డేట్.. అని అడిగారు కదా.. వారణాసి రిలీజైనపుడు మాత్రం.. మొత్తం ప్రపంచం గౌరవిస్తుంది. ఇది కేవలం టైటిల్ అనౌన్స్ మాత్రమే.. ముందు ముందు ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఈ సినిమా కోసం మరింత కష్టపడుతున్న.. ఇంకా చెప్పాలంటే.. నా మనసు, సర్వం అన్ని పెట్టి నటిస్తున్నా.. ఈ సినిమా నా జీవిత గమ్యం అని మహేష్ ఎమోషనల్ అయ్యారు. చివరగా ఫ్యాన్స్ ఉద్దేశించి మాట్లాడుతూ.. థ్యాంక్యూ అన్నది చాలా చిన్న మాట. నా ప్రేమ ఎప్పుడు మాటల్లో చెప్పలేను. చేతులెత్తి దండం పెట్టడం తప్ప నాకేమి తెలియదు.. ’’ అని మహేష్ బాబు అన్నారు. 

ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ', ప్రియాంక చోప్రా 'మందాకినీ'గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సంచారి సాంగ్ గ్లోబల్ ట్రెండింగ్ అయింది. ఈ పాట ద్వారా సినిమా యొక్క థీమ్ని చెప్పేశారు జక్కన్న. ఇప్పుడు రిలీజైన టైటిల్ గ్లింప్స్‌తో మరింత అర్ధాన్ని తీసుకొచ్చారు. అందులో ఉన్న శివతత్వం ఎలాంటి భోదన చేస్తుందనేది ఇపుడు ఆడియన్స్కి మరింత అర్ధమవుతుంది.

శివుడు మహాకాలుడు-నిత్యం భ్రమించే కాలాన్ని సృష్టించి, పాలించడమే కాకుండా సంహరించే దేవుడు అనే అర్ధంతో జక్కన్న ఈ పాట ద్వారా చెప్పుకొచ్చారు. ఇకపోతే, ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌‌‌‌పై కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌‌‌‌తో నిర్మిస్తున్నారు. మూవీ 2027 వేసవిలో విడుదల కానుంది.