క్లాస్ రూంలో దళిత విద్యార్థి ఉరి కేసులో ఇద్దరు టీచర్లు సస్పెండ్

క్లాస్ రూంలో దళిత విద్యార్థి ఉరి కేసులో ఇద్దరు టీచర్లు సస్పెండ్

రాజస్థాన్ లోని కోట్ పుత్లీ  గవర్న్ మెంట్ స్కూల్ 15 యేళ్ల దళిత విద్యార్థి ఆత్మహత్య కేసులో ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు టీచర్లపై ఐపీసీ సెక్షన్ 302 సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

శుక్రవారం నవోదయ స్కూల్ హాస్టల్ లో  చదువుతున్న విద్యార్థి తరగతి గదిలో ఉరి వేసుకొని మృతిచెందాడు.  బాలుడినీ కులం పేరుతో దూషించారని ఆరోపిస్తూ స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన టీచర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  దీంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇద్దరు టీచర్లు బాలుడిని కులం పేరుతో తిట్టారని తన తండ్రికి చెప్పాడని, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ వారిపై చర్యలు తీసుకోలేదని ఎఫ్ ఐఆర్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందజేస్తామని పాఠశాల యాజమాన్యం హామీ ఇవ్వడంతో కుటుంబీకులు, స్థానికులు ఆందోళన విరమించారు.